Disruption To Pakistan On Kashmir Issue :
ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ (OIC) సమావేశంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం ఎదురైంది. నైగెర్ రాజధాని నైమి లో జరిగిన ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ దేశాల సమావేశంలో కశ్మీర్ అంశాన్ని చర్చకు పెట్టాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి తీర్మానం ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించగా సభ్య దేశాలు తిరస్కరించాయి.
పాకిస్థాన్ ప్రతిపాదనను ఆతిథ్య దేశం నైగెర్, సౌది అరేబియా దేశాలు నిర్ధ్విద్వంగా తోసిపుచ్చాయి. సమావేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని నైగెర్ దేశ ప్రతినిధి స్పష్టం చేశారు. అరబ్ ప్రపంచం, ఇస్లామిక్ దేశాలతో పాటు ప్రపంచానికి ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమించిందని సౌది అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది. సమకాలిన పరిస్థితుల్లో ఉగ్రవాదం జాడలు వెతికితే పాకిస్తాన్ లోనే వాటి మూలాలు కనిపిస్తున్నాయని, మైనారిటీల హక్కుల రక్షణలో పాక్ విధానాలు అక్షేపనీయమని సౌది అరేబియా నిష్కర్షగా విమర్శించింది.
భారతదేశం తమ దేశంలో దేవాలయాన్ని నిర్మించడంతో ఇస్లామిక్ ప్రపంచానికి సమస్య ఏమిటి ? అయోధ్య రామ మందిరంతో ప్రపంచంలోని ముస్లింలకు ఇబ్బందేమిటిని సమావేశానికి అధ్యక్షత వహించిన UAE సుల్తాను పాకిస్థాన్ ను ప్రశ్నించారు. “భారతదేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి మాకు ఆసక్తి లేదు. అదనంగా UAEలో దేవాలయ నిర్మాణానికి 13 ఎకరాల భూమి, పార్కింగ్ మరియు హిందువులకు ఇతర సౌకర్యాల కోసం 13.5 ఎకరాల భూమిని అందించాము.” అని ఆయన ఇస్లాం ప్రపంచానికి తెలియజేసారు.
OlC నుండి అప్పుగా తీసుకున్న డబ్బును పాకిస్తాన్ ఎప్పుడు తిరిగి చెల్లిస్తుంది ? పాకిస్తాన్ మినహా అన్ని ఇస్లామిక్ దేశాలు ఈ నిధికి సహకరించాయి. పాకిస్తాన్ మాత్రమే అప్పు తీసుకుంది కానీ చెల్లించడంలో విఫలమైందని సౌది అరేబియా ప్రతినిధి గట్టిగా అడిగారు.
Also Read : నాగాలాండ్ లో ఉద్రిక్తత