Monday, January 20, 2025
HomeTrending Newsకొత్త జిల్లాల్లో.. ఇక జిల్లా జడ్జీ కోర్టులు

కొత్త జిల్లాల్లో.. ఇక జిల్లా జడ్జీ కోర్టులు

District Courts :కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జీ కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం అరణ్య భవన్ లో న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి సమావేశమై కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటు ప్రక్రియపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మినహా మిగిలిన అన్ని కొత్త జిల్లాల్లో ఇప్పటికే అదనపు జిల్లా జడ్జీ కోర్టులు ఉన్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర హైకోర్టు ఇదివరకు తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటు ప్రక్రియ పురోగతిపై సమావేశంలో సమీక్షించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న అదనపు జిల్లా కోర్టుల ప్రాంగణంలోనే కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పడనున్నాయి. ఉమ్మడి జిల్లా కోర్టులో ఉన్న కేసులన్నింటిని ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కోర్టులకు … ఆయా జిల్లాల పరిధిలోని కేసులను బదిలీ చేయనున్నారు.

వివిధ అంశాలపై కోర్టులను ఆశ్రయించే వారికి సకాలంలో న్యాయం అందించేందుకు కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కోర్టులు దోహదం చేయనున్నాయి. కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో బాధితులకు తక్కువ సమయంలో న్యాయం అందించేందుకు వీలు కలుగనుంది.

Also Read : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జిల్లాల బాధ్యతలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్