Wednesday, April 2, 2025
Homeసినిమాయూత్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న‌ డీజే టిల్లు ట్రైలర్‌

యూత్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న‌ డీజే టిల్లు ట్రైలర్‌

DJ Tillu Trailer : సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన మూవీ ‘డీజే టిల్లు’. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదలైంది. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చున్‌ ఫోర్‌ సినిమాస్‌ కలిసి నిర్మిస్తున్నాయి. తమన్‌ సంగీతాన్ని సమకూర్చారు. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ”బన్నీ మూవీతో మ్యూజిక్‌ డైరక్టర్‌గా లాంచ్‌ అవుతున్నా నేను. యాక్చువల్లీ మొన్న కామన్‌ ఫ్రెండ్‌ బర్త్ డే పార్టీలో కలిసిండు.  మనమూ డీజే టిల్లూ అని ఒక పాట కొట్టినం యూట్యూబ్‌లో చూసినవా అది – చార్ట్ బస్టర్ అది సాంగ్‌, అది ఇన్నడు. బట్టలు చించేసుకున్నడు. అరె టిల్లూ ఇసువంటి పాటనే కావాల్రాబై అన్నడు” అనే డైలాగ్‌తో మొదలవుతుంది డీజే టిల్లు ట్రైలర్‌. ‘ఒక ల్యాండ్‌ ఉన్నది అది మన సొంతమూ, మన పర్సనల్‌ అనుకున్నా నేను. కాకుంటే, ఊర్లో ఉన్న అవగాళ్లు అందరి పేర్ల మీద ఉన్నది అది, ఏం జేస్తాం. అదేదో సెటిల్మెంట్‌ ఉంటే హోటల్‌ పోతున్నా నేను’ తరహా డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

ఓవరాల్‌గా యూత్‌ని అట్రాక్ట్ చేసే సినిమా ఇది. సిద్ధు జొన్నలగడ్డ నేచురల్‌గా పెర్పార్మ్ చేశారు. ట్రైలర్‌ కట్‌ చేసిన విధానం బాగుంది. సినిమా మీద ఆసక్తి పెంచుతోంది. ఫిబ్రవరిలోనే విడుదల కానుంది డీజే టిల్లు.

Also Read : కర్ణలోని ‘గుడి యనక నా సామి’ పాట రిలీజ్ చేసిన శేఖర్ మాస్టర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్