Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Karna: యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన‌ చిత్రం ‘కర్ణ’. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి కళాధర్ కొక్కొండ దర్శకత్వం వహించారు. మోనా ఠాకూర్ హీరోయిన్ గా నటించిన‌ ఈ సినిమాలో ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రవణ్ G కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గీతామాధురి ఈ పాటను ఆలపించగా అనిల్ సాహిత్యాన్ని అందించారు.

కిరణ్ బందర్ కొరియోగ్రఫీ అందించారు. త్వరలోనే ఈ సినిమా ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుని సినిమా పై భారీ అంచనాలు ఏర్పరిచింది. తాజాగా ఈ సినిమా నుంచి  ‘గుడి యనక నా సామీ’ పాటను విడుదల చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటను విడుదల చేయడం విశేషం.

ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ “కర్ణ సినిమాలోని గుడి యనక నా సామీ పాటను విడుదల చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. కిరణ్ బండార్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. తప్పకుండా ఈ పాట మీ అందరిని ఆకట్టుకుంటుంది. అందరికీ అల్ ది బెస్ట్” అన్నారు

Also Read : చివరి షెడ్యూల్‌ లో ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com