Saturday, June 13, 2026
Homeసినిమాడిసెంబర్ 9న 'డాక్టర్ 56' విడుదల

డిసెంబర్ 9న ‘డాక్టర్ 56’ విడుదల

ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలాంటి ఓ డిఫరెంట్ కథతోనే ప్రియమణి ముందుకు వస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రియమణి ప్రస్తుతం ‘డాక్టర్ 56‘ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు . ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ మీద అందిస్తున్నారు. ఇది వరకే ఈ బ్యానర్ మీద మంచి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రభుదేవా ఫ్లాష్ బ్యాక్, వర ఐపీఎస్, ఛేజింగ్ వంటి చిత్రాలు కూడా ఈ బ్యానర్ మీద రెడీ అవుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి.

ప్రస్తుతం ప్రియమణి నటించిన ‘డాక్టర్ 56’ అనే ఈ సినిమాకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వచ్చి ప్రమోషన్ చేయడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. దీంతో పాటుగా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. ఇండియాలో ఐదేళ్లలో 2163 మంది అంటూ అలా సస్పెన్స్‌గా వదిలేశారు. మోషన్ పోస్టర్లో చూపించిన ఈ సంఖ్య, ప్రియమణి గన్నుపట్టుకున్న తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి.

ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్‌ అందిస్తుండగా.. రాజేష్‌ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్ మీద ఈ సినిమాను ప్రవీణ్‌ రెడ్డి. టి నిర్మిస్తున్నారు. నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్‌గా, రాకేష్ సి తిలక్ కెమెరామెన్‌గా, విశ్వ ఎన్ ఎమ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మాటలు భార్గవ్ రామ్ అందిస్తుండగా, పాటలకు సాహిత్యాన్ని చల్లా భాగ్యలక్ష్మీ , జె లక్ష్మణ్ అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular