Sunday, November 24, 2024
HomeTrending Newsదేశ వ్యాప్తంగా వసంతోత్సవ వేడుకలు

దేశ వ్యాప్తంగా వసంతోత్సవ వేడుకలు

దేశ వ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సంబరాలు కోలాహలంగా జరుగుతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఉత్త‌ర భార‌త దేశంలో హోళీ ప‌ర్వ‌దినాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. అన్ని ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు రంగులు చ‌ల్లుకుంటూ ఆనందోత్స‌హాల్లో తేలిపోతున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో డోల్ ఉత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌జ‌లు ఒక‌రికి ఒక‌రు గులాల్ రాసుకుంటూ పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. రవీంద్ర నాథ్ టాగోర్ స్థాపించిన శాంతిని కేతన్ లో హోలీ సందర్భంగా ప్రత్యెక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశ్వభారతి విశ్వవిద్యాలయంలో వారం రోజుల నుంచి వసంతోత్సవ సంబరాలు సాగుతున్నాయి.

ఉత్తర ప్రదేశ్ లోని  మధురలో వేకువ జాము నుంచే హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. బృందావన్ లో ఇస్కాన్ భక్తులు శ్రీ కృష్ణుడి కీర్తనలతో హోలీ జరుపుకుంటున్నారు.

మధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినిలో ఉన్న మ‌హాకాలేశ్వ‌రుడి జ్యోతిర్లింగ క్షేత్రంలో ఇవాళ అత్యంత వైభ‌వంగా హోళీ వేడుక‌ల్ని నిర్వ‌హించారు. మ‌హాకాలుడికి భ‌స్మ హార‌తి నిర్వ‌హించే స‌మ‌యంలో.. గులాబీ రంగుల‌తో పూజ‌లు నిర్వ‌హించారు. శివుడిని అల‌క‌రించిన త‌ర్వాత పూజారులు ఆల‌య గ‌ర్భ‌గుడిలో గులాల్ రంగులు చ‌ల్లుకున్నారు. భ‌స్మ హార‌తి వీక్షించేందుకు వ‌చ్చిన భ‌క్తుల‌పై కూడా ఆ రంగులు చ‌ల్లారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్