కూలీవాడి కొడుకు కూలీగానే ఉండాలని ఆలోచించేవాడు చంద్రబాబు అయితే, కూలీవాడి కొడుకు కలెక్టర్ కావాలన్న ఆలోచన సిఎం జగన్ దని, దానికోసం ఏమి చేయాలో అదంతా చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గతంలో మిగిలిన కులాలకు సేవచేసేవాళ్ళని, ఈరోజు అనేక పదవులు వారికి దక్కాయని వెల్లడించారు. బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికారయాత్ర విజయవంతమైనది. స్థానిక ఎమ్మెల్యే డా.సుధ అధ్యక్షత వహించిన బహిరంగసభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి తదితరులు ప్రసంగించారు. తనకు ఓటేసిన వారిని మోసం చేసే గుణమున్నవాడు చంద్రబాబు అని నారాయణ స్వామి విమర్శించారు.
ఎమ్మెల్యే డాక్టర్ సుధ మాట్లాడిన ముక్యంశాలు:
* అణగారిన వర్గాలను పైకి తీసుకురావాలని..గతంలో మహనీయులెందరో కలలు కన్నారు.
* జగనన్న వారి కలలను అర్థం చేసుకున్నారు. సామాజిక సాధికారత అవసరాన్ని గుర్తించారు. * అంబేడ్కర్, ఫూలేల ఆశయాల బాటలో నడిచి, ఈ రోజు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల నాయకులను అధికారపదవుల్లో కూర్చోబెట్టి..వారి రాజకీయ,సామాజిక,ఆర్థిక స్థాయిని పెంచారు.
* బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన నలుగురిని డిప్యూటీ సీఎంలుగా చేశారు.
* వైద్యరంగంలో జగనన్న అద్భుతాలు చేశారు. ఏ పేదవాడికైనా జబ్బు చేస్తే … భయపడాల్సిన అవసరం లేకుండా చేశారు.
మాజీ ఎంపీ బుట్టారేణుక మాట్లాడుతూ..
* ఈరోజు ప్రతిసామాజికవర్గంలోని ఆత్మవిశ్వాసం నింపి, వారికి పదవులు ఇచ్చారు జగనన్న.
* గతంలో ఎన్నడూ లేని రీతిలో పరిపాలన అందిస్తున్నారు
* వలంటీర్ల ద్వారా సంక్షేమపథకాలు ఇంటి దగ్గరే అందేలా చేశారు.
* ఆరోగ్యశ్రీని ఎంతో బలోపేతం చేసి..పేదల పాలిట దేవుడే అయ్యాడు.
* మహిళల గురించి ప్రత్యేకంగా ఆలోచించే జగనన్న..వారి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు.
* ఇళ్లపట్టాలు మహిళల పేరునే ఇస్తున్నారు.
* కరోనాలాంటి కష్టకాలంలో జగనన్న పాలించిన తీరు దేశంలో ఏ రాష్ట్రంలోనూ మనం చూడలేదు.
* చంద్రబాబును నమ్మితే మనం కష్టాలు పడాల్సిందే
* సంక్షేమపథకాలు అమలుకావాలన్నా, పేదలజీవితాలు బాగుపడాలన్నా జగనన్నే మళ్లీ రావాలి