Saturday, January 18, 2025
HomeTrending Newsఅంబులెన్సులు ఆపొద్దు : హైకోర్టు

అంబులెన్సులు ఆపొద్దు : హైకోర్టు

ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో అంబులెన్సుల నిలిపివేతపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది తెలంగాణా హైకోర్టు. హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్ కన్ఫర్మేషన్ లేకపోయినా అంబులెన్సులు అపోద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కే ఏ పాల్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు… హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందని స్పష్టం చేసింది.

ఈ నెల 10 వ తేది నుంచి కోవిడ్ చికిత్స కోసం ఆంధ్ర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగులను తెలంగాణా సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రి నుంచి ఐసియూ బెడ్ కేటాయించినట్లు ఆధారాలు చూపిస్తేనే పోలీసులు అనుమతిస్తున్నారు. లేనివారిని వెనక్కు పంపుతున్నారు. హైదరాబాద్ లో ఆక్సిజన్ కొరత వుందని ఆంధ్ర ప్రదేశ్ లోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.

దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణా హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మత ప్రచారకుడు కే ఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్ట్ అంబులెన్సులు ఆపడానికి వీల్లెడంతూ తెలంగాణా ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్