Saturday, January 18, 2025
Homeసినిమాబరిలోకి దిగుతున్న గల్లీ పిలగాడు .. 'డబుల్ ఇస్మార్ట్'

బరిలోకి దిగుతున్న గల్లీ పిలగాడు .. ‘డబుల్ ఇస్మార్ట్’

పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ వసూళ్లను రాబట్టింది. నిర్మాతలుగా పూరి – చార్మి మంచి లాభాలను చూశారు. ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్నదే ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమాకి కూడా వారే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను నిన్న వదిలారు. ఫస్టు పార్టు తరహాలోనే ఈ సినిమాలోను రామ్ గట్టిగానే హడావిడి చేస్తూ కనిపించాడు. మాస్ డైలాగులతో కూడిన మాస్ యాక్షన్ తో సందడి చేశాడు.

నిన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ‘వైజాగ్’లో జరిగింది. ఈ ఫంక్షన్ కి పూరి రాలేకపోయాడు. అందువల్లనే ఒక బైట్ చేసి పంపించాడు. ఇది గల్లీ సినిమా అనే విషయాన్ని మరోసారి ఆడియన్స్ కి గుర్తుచేశాడు. ఫస్టు పార్టులో రామ్ బ్రెయిన్ లో ‘చిప్’ సెట్ చేసి కావాల్సినంత అల్లరి చేయించారు. ఈ సినిమాలో కూడా రామ్ బ్రెయిన్ పై విలన్ సంజయ్ దత్ ఏవో ప్రయాగాలు చేయడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఆ ప్రయోగం ఫలితంగా రామ్ ఎంతటి హంగామా చేస్తాడా అనేది తెరపై చూడాల్సిందే.

కావ్య థాపర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా సంజయ్ దత్ కనిపించనున్నాడు. ఇక ఫస్టు పార్టు మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేయడంలో మణిశర్మ ప్రధానమైన పాత్రను పోషించాడు. ఆయనే ఈ సినిమాకి కూడా బాణీలను సమకూర్చాడు. అందువలన ఆడియోపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా హిట్ కావడమనేది అటు పూరి .. చార్మీలకు, ఇటు రామ్ కి చాలా అవసరమనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్