Saturday, March 14, 2026
Homeసినిమాఎమ్మెల్యేగా డా.రాజేంద్రప్రసాద్

ఎమ్మెల్యేగా డా.రాజేంద్రప్రసాద్

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘శాసనసభ’. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. కన్నడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా పేరుపొందిన తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డా.రాజేంద్రప్రసాద్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆగస్టు 15 ఇండిపెండేన్స్ డే సందర్భంగా  చిత్ర బృందం విడుదల చేసింది.  నిర్మాతలు మాట్లాడుతూ “పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో  రాజేంద్రప్రసాద్ గారు ఎమ్మేల్యే నారాయణస్వామిగా నటిస్తున్నారు. విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన పాత్ర ఎంతో అద్భుతంగా వుంటుంది. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో పోషించనటువంటి విభిన్నమైన పాత్ర ఇది.  ఈ చిత్రంలో ఈ పాత్ర ఎంతో హైలైట్‌గా వుంటుంది. మా చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవిబసుర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఆయన నేపథ్య సంగీతంతో విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు అనూహ్య స్పందన దక్కింది. చిత్రం కూడా తప్పకుండా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది”అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular