Sunday, June 14, 2026
Homeసినిమా‘దృశ్యం-2’ సెన్సార్ పూర్తి

‘దృశ్యం-2’ సెన్సార్ పూర్తి

వెంకటేష్ కెరీర్‌లో ‘దృశ్యం’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ ‘దృశ్యం-2’ రెడీ అయింది. ఈ మూవీని జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. దీన్ని బట్టి ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులందరితో కలిసి అందరూ వీక్షించవచ్చని తెలుస్తోంది.

దృశ్యం సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో.. సీక్వెల్ మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. త్వరలోనే చిత్రయూనిట్ ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు. మొదటి పార్టులో కనిపించిన మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్ ఇలా అందరూ కూడా సీక్వెల్‌లో నటిస్తున్నారు. ఇక సంపత్ రాజ్, పూర్ణలు కొత్తగా సీక్వెల్‌లో కనిపించబోతోన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు థ్రిల్లింగ్ పార్ట్ ఎంతో ఉంది. వెంకటేష్ నటన అందరినీ మెస్మరేజ్ చేయబోతోంది. త్వరలోనే మూవీ విడుదల చేయనుండటంతో ఫుల్ స్వింగ్‌లో ప్రమోషన్స్ చేయబోతోన్నారు చిత్ర యూనిట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular