7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

Homeసినిమారానా, దుల్కర్ కాంబో మూవీ టైటిల్ ఫిక్స్..

రానా, దుల్కర్ కాంబో మూవీ టైటిల్ ఫిక్స్..

రానా, దుల్కర్ సల్మాన్ ఓ చిత్రం కోసం జతకట్టారు. రానా స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ మల్టీ లింగ్వల్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు.

తాజాగా దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దుల్కర్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ అందిస్తూ ఖుషీ చేస్తున్నాడు.దుల్కర్ సల్మాన్ పుట్టినరోజున మేకర్స్ ఆసక్తికరమైన పోస్టర్‌తో సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కాంత’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించనున్నారు.

 ఈ సినిమాతో అసోసియేట్ అవ్వడానికి చాలా ఎక్సయిటెడ్ గా వున్న రానా ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని భరోసా ఇచ్చారు.

ఈ చిత్రం గురించి రానా మాట్లాడుతూ.. “చాలా అరుదుగా మంచి సినిమా పవర్ గుర్తు చేసే కథ మనకు కనిపిస్తుంది. కాంత మమ్మల్ని ఒకచోట చేర్చిన ప్రాజెక్ట్. సూపర్ ట్యాలెంటెడ్ దుల్కర్ సల్మాన్, వేఫేరర్ ఫిలిమ్స్ తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల మేము ఆనందిస్తున్నాము. అతని పుట్టినరోజు సందర్భంగా రాబోయే సరికొత్త ప్రపంచానికి సంబధించిన టైటిల్ రివిల్ చేశాం. పుట్టినరోజు శుభాకాంక్షలు దుల్కర్ సల్మాన్. కాంత ప్రపంచానికి స్వాగతం.” అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టీం వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్