Saturday, March 7, 2026
Homeసినిమాముసలిమడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్

ముసలిమడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్

#NBK107: నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేనిల హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ షూటింగ్  ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొంటుంది. తాత్కాలికంగా పెట్టిన #NBK107 టైటిల్ వున్న ఈ సినిమాతో కన్నడ స్టార్ దునియా విజయ్ టాలీవుడ్లోకి ప్రవేశిస్తున్నారు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్ ని పరిచయం చేస్తూ, ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. సిగరెట్ తాగుతూ పోస్టర్లో రఫ్ గానూ సీరియస్ గెటప్ లో కనిపించాడు. ఆయన గెటప్ తో సినిమాలో ఆయన నటిస్తున్న పవర్ఫుల్ రోల్ ను తెలియజేస్తుంది. దునియా విజయ్ ఇప్పటికే షూట్లో జాయిన్ అయ్యాడు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా  నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. రామ్-లక్ష్మణ్ ద్వయం ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్న ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular