Tuesday, June 9, 2026
Homeసినిమాబాల‌య్య మూవీలో క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజయ్

బాల‌య్య మూవీలో క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజయ్

Balayya Vs. Vijay Duniya: మాస్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌ ‘అఖండ’ తో భారీ బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకున్నారు. ‘క్రాక్’ తో టాలీవుడ్ కు అద్భుతమైన హిట్‌ని అందించిన సక్సెస్ ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. #NBK107 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ఇప్పటికే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు.

మాస్‌ హీరో, మాస్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మాస్ ఆడియ‌న్స్ కి ఫుల్‌ మీల్స్ అందించబోతోంది. అంతే కాదు ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర ఉంది. ఆ పాత్ర‌ను ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ చేయ‌నున్నారు. తెలుగులో ఈ క‌న్న‌డ నటుడికి ఇది సరైన ప్రారంభం అని చెప్ప‌చ్చు. దీంతో ఈ సినిమాలో బాలకృష్ణ, దునియా విజయ్‌ల మ‌ధ్య ఫైట్స్ ఏ రేంజ్ లో ఉండ‌బోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.  నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండ‌గా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. ఈ నెల నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read : సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న ఆశిష్ ‘రౌడీ బాయ్స్’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular