అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్పంగా భూమి కంపించింది. రాజధాని పోర్ట్‌బెయిర్‌లో శుక్రవారం అర్ధరాత్రి 11.56 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. పోర్ట్‌బ్లెయిర్‌కు 140 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొన్నది. భూ అంతర్భాగంలో 28 కిలోమీటర్ల లోతున ప్రకంపణలు వచ్చాయని వెల్లడించింది. గత నెల 24న ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో భూకంపం వచ్చింది. దీనితీవ్రత 3.9గా నమోదయిందని ఎన్‌సీఎస్ తెలిపింది.
Earthquake: అండమాన్ లో భూకంపం
మార్చి 26న రాజస్థాన్‌లోని బికనేర్‌లో భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 2.16 గంటలకు బీకనేర్‌లో 4.2 తీవ్రతతో భూమి కంపించింది. అంతకుముందు అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఛంగ్‌లంగ్ జిల్లాలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. తెల్లవారుజామున 1.45 గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.5గా నమోదయిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది.