అసోంలోని నాగోన్ పట్టణంలో ఆదివారం సాయంత్రం భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. 4.18 గంటలకు నాగోన్ పరిధిలోని 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ విషయాన్ని జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. అయితే, ఎంత మేర ప్రభావం ఉన్నదనే విషయాలను వెల్లడించలేదు.
గత కొన్ని రోజులుగా మన దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపిస్తూనే ఉన్నది. గుజరాత్‌లోని సూరత్‌లో కూడా స్వల్ప భూకంపం వచ్చింది. హజిరా జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో 5.2 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం కనిపించింది. దీని తీవ్రత 3.8 గా నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఈ నెల 4 వ తేదీన మణిపూర్‌లోని ఉఖ్రుల్ ప్రాంతంలో ఉదయం 6.14 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.