Saturday, November 23, 2024
HomeTrending Newsఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా ఉత్తర ప్రాంతంలో ఈ రోజు భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు వేకువ జామున (బుధవారం) ఉత్తర సులావేసిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.1గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది. సులవేసి ప్రావిన్స్‌కి ఉత్తరాన 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొరొన్‌టాలోలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. సముద్రంలో 145 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీని ప్రభావం ఉత్తర మలుకు, మధ్య సులవేసి ప్రావిన్స్ లలో కనిపించింది. అయితే దీనివల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు అవసరం లేదని అధికారులు ప్రకటించారు.

కాగా, రెండో రోజుల క్రితం కూడా ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. సోమవారం ఉద‌యం 6:30 గంట‌ల‌కు సుమ‌త్రా దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా న‌మోదయింది. అంతకుముందు వారం రోజుల క్రితం త‌నింబ‌ర్ ప్రాంతంలో 7.7 తీవ్రత‌తో భూమి కంపించింది. సులవేసిలో 2018లో సంభవించిన భూకంపం, సునామీ వల్ల 4,340 మంది మరణించారు.
పసిఫిక్ మహా సముద్రంలో రింగ్ అఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాలో భూకంపాలు నిత్య కృత్యం కాగా అగ్ని పర్వతాలు బద్దలు కావటం లావా ఉపద్రవాలు రావటం సాధారణం. 270 మిలియన్ల జనాభా ఉన్న ఇండోనేషియాలో ప్రతి రోజు ఎదో ఒక చోట భు ప్రకంపనలు.. అగ్ని పర్వతాల పేలుడుతో ధూళి కమ్ముకోవటం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్