Saturday, November 23, 2024
HomeTrending Newsమలేషియాలో భూకంపం

మలేషియాలో భూకంపం

మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో ఈ రోజు భూకంపం సంభవించింది. సముద్రం లోపల వచ్చిన శక్తివంతమైన భూకంపాలు ఈ మూడు ద్వీపదేశాలను ఆందోళనకు గురిచేశాయి. ఇండోనేషియాలో, పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని పరియామాన్ పట్టణానికి పశ్చిమాన 169 కిలోమీటర్ల దూరంలో 16 కిలోమీటర్ల లోతులో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఫిలిప్పీన్స్ లో కూడా భూకంపం సంభవించింది. మనీలాకు దక్షిణంగా ఉన్న ఆక్సిడెంటల్ మిండోరో ప్రావిన్స్‌లోని లుబాంగ్ ద్వీపానికి పశ్చిమాన 110 కిలోమీటర్ల దూరంలో ఉందని ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. 6.4 తీవ్రతతో దాదాపు 28 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. మలేషియా దేశంలో భూకంప ప్రభావం కనిపించింది. కౌలాలంపూర్ కు నైరుతి దిశలో 504 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతతో భూకంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు.

ఈ భూకంపాల వల్ల పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. భూకంపాల వల్ల సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. భారతీయ కాలమాన ప్రకాటం ఈ భూకంపాలు అన్ని అర్థరాత్రి తరువాత రెండు  గంటల ప్రాంతంలో సంభవించాయి. ప్రజలు ప్రకంపనలకు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ మూడు దేశాలు పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” వెంబడి ఉన్నాయి. ఈ దేశాల సముద్రాల్లో భూకంపాలు సంభవించడం.. అగ్ని పర్వతాలు బద్ధలు అవ్వడం తరచుగా జరుగుతుంటాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్