Sunday, January 19, 2025
HomeTrending Newsటర్కీలో భారీ భూకంపం...పొరుగు దేశాల్లోను ప్రభావం

టర్కీలో భారీ భూకంపం…పొరుగు దేశాల్లోను ప్రభావం

భారీ భూకంపం టర్కీని కుదిపేసింది. గజియాన్టెప్‌ ప్రావిన్స్‌లోని నుర్దగీ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదయిందని యూఎస్‌ జియోగ్రాఫికల్‌ సర్వీస్‌ వెల్లడించింది. సోమవారం ఉదయం 4.17 గంటలకు భూమికంపించిందని, నుర్దగీకి 26 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూమిలోపల 17.9 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చిందని తెలిపింది. భారీ భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భవనాలు కూలిపోవడంతో ఇప్పటివరకు సుమారు 95 మందివరకు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. టర్కీకి ప్రధానమైన పారిశ్రామిక కేంద్రమైన గజియాన్టెప్‌.. సిరియా సరిహద్దుల్లో ఉన్నది. భూకంప ప్రభావంతో లెబనాన్‌, సిరియా, సైప్రస్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. సిరియా పశ్చిమ తీరప్రాంతమైన లటకియాలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి.

1999లో టర్కీలో 7.4 తీవ్రతతో భూప్రకంపనలు అల్లకల్లోలం చేశాయి. నమోదయ్యాయి. దీంతో 17వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇస్తాంబుల్‌ నగరంలోనే వెయ్యి మందికిపైగా ప్రజలు మృతి చెందారు. ఇక 2020లో ఎలజిగ్​ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం ధాటికి 40 మంది బలయ్యారు. గతేడాది అక్టోబర్‌లో 7.0 తీవ్రతతో వచ్చిన భూకంపంతో 114 మంది మరణించారు. మరో వెయ్యి మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.

Also Read : మణిపూర్‌లో భూకంపం

RELATED ARTICLES

Most Popular

న్యూస్