ENC officers met CM:
తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.  ఇటీవలే తూర్పు నావికాదళ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా (ఏవీఎస్‌ఎమ్, వైఎస్‌ఎమ్, విఎస్‌ఎమ్‌) భాద్యతలు స్వీకరించారు.

ఈఎన్‌సీ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తాని సన్మానించి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమ సిఎం జగన్ అందజేశారు. నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్‌ వీఎస్‌సీ రావు, కెప్టెన్‌ ప్రదీప్‌ సింగ్‌ సేతి, సివిల్‌ మిలటరీ లైజన్‌ ఆఫీసర్‌ కమాండర్‌ సుజిత్‌ రెడ్డి కూడా సిఎం ను కలుసుకున్నవారిలో ఉన్నారు.

తూర్పు సముద్ర తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్ళను అధిగమించేందుకు భారత నావికాదళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను సిఎంకు  బిశ్వజిత్‌ దాస్‌గుప్తా వివరించారు.  2022 ఫిబ్రవరిలో విశాఖపట్టణంలో జరగనున్న ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ రివ్యూ, మల్టినేషనల్‌ మేరిటైమ్‌ ఎక్సర్‌సైజ్‌ మిలాన్‌ సన్నాహక కార్యకలాపాల పురోగతిని కూడా సీఎంకి వివరించారు.

Also Read :సిఎంతో నేవీ అధికారుల భేటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *