Friday, October 18, 2024
HomeTrending News2024-25 ఆర్థిక సంవత్సరంలో  6.5-7 శాతం వృద్ధి అంచనా

2024-25 ఆర్థిక సంవత్సరంలో  6.5-7 శాతం వృద్ధి అంచనా

2023-24 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో  ప్రవేశపెట్టారు.  2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం బడ్జెట్‌ సమర్పించనున్న నేపథ్యంలో ఆనవాయితీగా నేడు ఈ సర్వేను సభ ముందుంచారు.

శ్రామికశక్తిని పెంపొందించడానికి వ్యవసాయేతర రంగంలో 2030 వరకూ ఏటా 78 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందేనని ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది. 2023-24లో వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి 45.8 శాతం ఉందని, 2047 నాటికి అందులో నాలుగోవంతుకు తీసుకు రావాలని ప్రతిపాదించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో  6.5 నుంచి 7 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని అంచనా వేశారు.

సర్వేలోని ఇతర ముఖ్యాంశాలు:

  • ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగినా దేశీయ వృద్ధి చోదకాలు ఆర్థికానికి అండగా నిలిచాయి.
  • దేశంలో ఆర్థిక వ్యవస్థ మున్ముందు వృద్ధిలో ముందుకు దూసుకెళ్లనుంది..
  • అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలు, వాటి ప్రభావం ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రభావితం చేయొచ్చు.
  • ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
  • కార్పొరేట్‌, బ్యాంకింగ్‌ బ్యాలెన్స్ షీట్స్‌ బలంగా ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుంది.
  • భారత వృద్ధిలో క్యాపిటల్‌ మార్కెట్‌లది కీలకపాత్ర. భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిణామాలను తట్టుకోలదని ఆర్థిక సర్వే అభిప్రాయం.
  • పెరిగిన చైనా ఎఫ్‌డీఐలు ప్రపంచంలో భారత సప్లయ్‌ చైన్‌లో భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఎగుమతులకు ఊతమివ్వడానికి సహాయపడుతుంది.
  • దేశంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టింది. 2022-23 నాటికి నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గింది.
  • ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల రూ.67,690 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో రూ.14వేల కోట్లు కార్యరూపం దాల్చాయి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్