Friday, March 13, 2026
HomeTrending Newsనైజీరియాలో ఘోర ప్రమాదం

నైజీరియాలో ఘోర ప్రమాదం

నైజీరియా దక్షిణ రాష్ట్రమైన ఇమోలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో..శనివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా కార్మికులు సజీవదహనం అయ్యారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన అనేక మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. పలువురు మంటల్లో కాలిపోయి బూడిదయ్యారని..ఎంత మంది మరణించారన్న దానిపై ఖచ్చితమైన లెక్కలు లేవని స్థానిక అధికారులు వెల్లడించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కార్మాగారంలో సహాయ చర్యలు చేపట్టడం కూడా అధికార యంత్రాంగానికి కష్టతరమైంది.

సిబ్బంది అంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడికక్కడే చాలా మంది మరణించారు. కొందరు ప్రాణ భయంతో బయటకు పరుగులు చేశారు. చెట్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. చెట్ల కొమ్మలకు శవాలు వేలాడుతూ కనించాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘటన రివర్స్, ఇమో స్టేట్ మధ్య సరిహద్దులో ఎగ్దేమలో జరిగిందని రివర్స్‌ స్టేట్‌ పోలీస్‌ ప్రతినిధి గ్రేస్‌ ఇరింగే కోకో తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రమాదానికి కారణమైన చమురు శుద్ధి కేంద్రం యజమాని కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.

నైజీరియాలో ఉద్యోగాలు దొరక్క చాలామంది యువత చమురు శుద్ధి కేంద్రాలను అక్రమంగా ఏర్పాటు చేస్తుంటారు. ఈ తరహా అక్రమ చమురు శుద్ధి కర్మాగారాలు దేశంలో చాలానే ఉన్నాయి. పైప్‌లైన్స్ ధ్వంసం చేసి దొంగిలించే ముడి చమురును ఇలాంటి వాటిలో శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. వీటిల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular