Friday, March 29, 2024
HomeTrending Newsఢిల్లీ మద్యం కుంభకోణంలో.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు తాజాగా నోటీసులిచ్చింది. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. మంగళవారం ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైను ఈడీ అరెస్ట్ చేయగా.. ఆయన రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. కవిత బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి కవిత ప్రతినిధిగా తాను వ్యవహరించినట్లు ఈడీ అధికారులకు రామచంద్ర పిళ్లై విచారణలో తెలిపారు. ఈ క్రమంలో కవితకు ఈడీ నోటీసులు రావడంతో.. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే చర్చ జరుగుతోంది. కవితను అరెస్ట్ చేయడం ఖాయమని గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్‌పై భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల 10న ఆందోళనలు చేపట్టాలని కవిత నిర్ణయించారు. స్వయంగా కవిత ఈ నిరసనల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజే కవితను లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలా రేపు కవితను ఈడీ ప్రశ్నించనుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేపే కవితను అరెస్ట్ చేస్తారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ సీబీఐ, ఈడీ అరెస్ట్ చేశాయి. ఇప్పటివరకు 11 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఇటీవల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడం సంచలనం రేపింది.

ఈ కేసులో ఇక కవిత ఒక్కరే మిగిలి ఉన్నారు. దీంతో ఆమెను అరెస్ట్ చేయడం అనివార్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో రేపు ఏం జరగబోతుందనేది బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు రేపుతోంది. కవితను అరెస్ట్ చేస్తారనే వార్తల క్రమంలో ఇటీవల ప్రగతిభవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. కవిత అరెస్ట్ అయితే తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారే అవకాశముంది. ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.

Also Read : మద్యం కుంభకోణంలో నిందితులకు బెయిల్ నిరాకరణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్