Friday, March 29, 2024
Homeసినిమా ‘అర్జున ఫల్గుణ’ నుంచి ఒక తీయని మాటతో.. సాంగ్

 ‘అర్జున ఫల్గుణ’ నుంచి ఒక తీయని మాటతో.. సాంగ్

Oka Teeyani Song:
కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.  ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా చిత్రంలోని ఒక తీయని మాటతో సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది. ఓక తీయని మాట తో సాంగ్‌ హీరో శ్రీవిష్ణు.. హీరోయిన్ అమృత అయ్యర్‌తో రిలేషన్‌లోని ఆనందాన్ని వ్యక్తం చేసే రొమాంటిక్ మెలోడీ. ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు.

శశ్వత్ సింగ్, శ్రేయా అయ్యర్ ఈ పాటను పాడారు. విజువల్‌గా.. ఈ పాట చక్కగా, లవ్లీగా కనిపిస్తుంది. ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. గతంలో విడుదలైన పాటలు కూడా సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి.. సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి (రాజా వారు రాణి గారు ఫేమ్), చైతన్య (మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

Also Read :  డిసెంబర్ 31న శ్రీవిష్ణు ‘అర్జున ఫల్గుణ’

RELATED ARTICLES

Most Popular

న్యూస్