Sunday, January 19, 2025
Homeసినిమాఈషా రెబ్బా కి టైమ్ కలిసి రావాలంతే! 

ఈషా రెబ్బా కి టైమ్ కలిసి రావాలంతే! 

తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా నిలదొక్కుకోవడం కష్టం. ఇతర భాషల నుంచి ఇక్కడికి వచ్చే కొత్త హీరోయిన్స్ నుంచి పోటీని తట్టుకోవడం కష్టం. అందువల్లనే తెలుగు అమ్మాయిలకు ఇక్కడ ఒక ఛాన్స్ ను సంపాదించుకోవడానికీ .. గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందువలన వీళ్లు కూడా ఇతర భాషల్లో కుదురుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి తెలుగు హీరోయిన్స్ లో ఈషా రెబ్బా కూడా కనిపిస్తుంది.

ఈషా రెబ్బా వరంగల్ బ్యూటీ. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటేసింది. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా .. పెద్ద సినిమాల్లో ముఖ్యమైన పాత్రలలోను కనిపించింది. అయితే హీరోయిన్ గా ఆమె చేసిన చిన్న సినిమాలు సరిగ్గా ఆడలేదు. పెద్ద సినిమాల్లో చేసిన పాత్రలు పేరు తేలేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఒకటి రెండు ఛాన్సులు వచ్చినప్పటికీ, ఆమె ఆ స్థాయి సినిమాలను కంటిన్యూ చేయలేకపోయింది.ఇప్పుడు కూడా ఆమె చేతిలో సుధీర్ బాబుతో చేసే సినిమా మాత్రమే ఉంది.

దాంతో ఆమె ఒక వైపున వెబ్ సిరీస్ లకు ప్రాధాన్యతనిస్తూనే, మరో వైపున తమిళ .. మలయాళ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతోంది. ఆ దిశగా ఆమె చేసిన ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే వర్కౌట్ అవుతున్నాయి కూడా. సోషల్ మీడియాలో హాట్ బ్యూటీగా పేరున్న ఈషా రెబ్బా, తన జోరు పెంచే పనిలోనే ఉంది .. పట్టుదలతోనే ఉంది. అంజలి .. స్వాతిరెడ్డి మాదిరిగా, తను కూడా తమిళ .. మలయాళ భాషల్లో రాణిస్తుందేమో చూడాలి. అలా రాణించాలంటే అక్కడ కూడా ఆమెకి టైమ్ కలిసి రావాలంతే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్