Sunday, January 19, 2025
Homeసినిమా'ఏక్ దమ్ ఏక్ దమ్' పాడుకున్న టైగర్ నాగేశ్వర రావు

‘ఏక్ దమ్ ఏక్ దమ్’ పాడుకున్న టైగర్ నాగేశ్వర రావు

రవితేజ తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో  అభిషేక్ అగర్వాల్ దీన్ని నిర్మిస్తున్నారు. రవితేజ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీ దేశంలోని అతిపెద్ద దొంగ  గురించి మాత్రమే కాదు అతని జీవితంలోని ఇతర కోణాలను ప్రజెంట్ చేస్తుంది. టైగర్ నాగేశ్వరరావు ప్రేయసి సారా పాత్రలో నుపుర్ సనన్ లుక్ ను ఇది వరకే మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా పెప్పీయెస్ట్ సాంగ్ ‘ఏక్ దమ్ ఏక్ దమ్’ ను 5 భాషల్లో విడుదల చేశారు. జీవీ ప్రకాష్ స్వరాలూ సమకూర్చిన  ఈ పాటలో డ్యాన్స్ రిథమ్స్ ఎక్స్ టార్డినరిగా వున్నాయి.  భాస్కరభట్ల సాహిత్యం నేటివిటీని జోడించగా, అనురాగ్ కులకర్ణి అద్భుతంగా అలపించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటలో రవితేజ.. తన ప్రేయసి పాత్రని పోషించిన నూపుర్ సనన్ ని ఆట పట్టిస్తూ కనిపించారు.

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ట్రాక్‌లోని ఎనర్జిటిక్ బీట్‌లకు సరిగ్గా సరిపోయే స్టెప్పులను క్రియేట్ చేశారు. రవితేజ యంగ్ గా కనిపించారు. రవితేజ డ్యాన్స్ యూత్, మాస్‌ని ఖచ్చితంగా మెప్పిస్తుంది. కాస్ట్యూమ్స్, సెట్లు కూడా రెట్రో అనుభూతిని పెంచుతాయి. ఈ పాటకు ఇన్స్టంట్ రెస్పాన్స్ వస్తోంది. రాబోయే రోజుల్లో మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్