Sunday, July 26, 2026
Homeసినిమా‘ఎక్కేసిందే’ అంటూ పాడుతున్న సంతోష్, మెహరీన్

‘ఎక్కేసిందే’ అంటూ పాడుతున్న సంతోష్, మెహరీన్

‘ఏక్ మినీ కథ’ తో సూపర్ హిట్ అందుకున్న సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా విలక్షణ దర్శకుడు మారుతి రూపొందిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘మహానుభావుడు’ తరువాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎక్కేసిందే’ ప్రోమో సాంగ్ విడుదలైంది. సంతోష్ శోభన్, మెహరీన్ డ్యాన్స్ ప్రోమోలో హైలైట్ అయింది. సెప్టెంబర్ 23న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ ప్రోమో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular