Friday, October 18, 2024
HomeTrending Newsకోడ్ ముగిసేవరకూ వాలంటీర్ల సేవలు బంద్ : ఈసీ ఆదేశం

కోడ్ ముగిసేవరకూ వాలంటీర్ల సేవలు బంద్ : ఈసీ ఆదేశం

ఎన్నికల కోడ్ ముగిసే వరకు గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వివిధ సంక్షేమ పథకాల కింద అందిస్తున్న నగదు పంపిణీని వాలంటీర్ల చేత చేయించవద్దని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని, ఇప్పటికే పథకాలు అందుకుంటున్న  లబ్ధిదారులకు  అందిస్తున్న నగదును పంపిణీ చేసేందుకు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని  ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం వాలంటీర్ల వద్ద ఉన్న ప్రభుత్వ మొబైల్ ఫోన్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని నిర్దేశించింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ సారధ్యంలో ఏర్పాటైన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థతోపాటు వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన కథనాల ఆధారంగా ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు ఎన్నికల సంఘం నేడు విడుదల చేసిన లేఖలో విస్పష్టంగా తెలియజేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్