Saturday, July 27, 2024
HomeTrending Newsఅద్వానికి అత్యున్నత పురస్కారం

అద్వానికి అత్యున్నత పురస్కారం

మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్‌ నేత లాల్ కృష్ణ అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి ఆదివారం పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్రపతితోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌కడ్‌, ప్రధాని నరేంద్రమోడి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అద్వానీ నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు.

భారత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్‌ సింగ్‌ సహా మరో ఇద్దరికి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కారాలు అందజేశారు. శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో  అవార్డుల ప్రదానం జరిగింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరపున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌ రావు భారత రత్న పురస్కారాన్ని అందుకున్నారు.

చౌదరీ చరణ్‌సింగ్‌ తరఫున ఆయన మనవడు జయంత్‌ చౌదరి, కర్పూరీ ఠాకూర్‌ తరఫున ఆయన కుమారుడు శ్రీరామ్‌నాథ్‌ ఠాకూర్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు భారత రత్న పురస్కారాలు స్వీకరించారు. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరయ్యారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్