సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల కానుంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం రేపు షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ విషయాన్ని ఈసీ ఓ ప్రకటనలో తెలియజేస్తూ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది.
ఆంధ్రప్రదేశ్ తో పాటు ఓడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఎన్ని దశల్లో ఎన్నికలు జరుగుతాయి, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దఫా నిర్వహిస్తారా లేదా అనేది రేపు తెలియనుంది.