జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ పైన కాంగ్రెస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ వేసిన కేసును పునపరిశీపన చేసి ఆరు నేలలలో వేగవంతం గా పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించిన సుప్రీంకోర్టు. టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినపుడు బిబి పాటిల్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయనపై ఉన్న నేరాలను అఫిడవిట్ లో పేర్కొనలేదని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మదన్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు.
మదన్ మోహన్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి కేసును కొట్టేవేశారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో మదన్ మోహన్ ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు పిటిషన్ ను పరిశీలించి హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి ఇచ్చిన తీర్పును పునః పరిశీలన చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ కు సూచించింది. ఆరు నెలల్లోపు వేగవంతంగా కేసును పరిశీలించి తీర్పు ఇవ్వాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ కు సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read : పొత్తుల చీలికల వైపు బిహార్ రాజకీయాలు