Friday, March 29, 2024
HomeTrending Newsరైల్వే జోన్ రాకపోతే రాజీనామా : విజయసాయి

రైల్వే జోన్ రాకపోతే రాజీనామా : విజయసాయి

విశాఖకు రైల్వే జోన్ వచ్చి తీరుతుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై నేడు రెండు దినపత్రికల్లో  వచ్చిన వార్తలను అయన తీవ్రంగా ఖండించారు. నిన్నటి సమావేశంలో రైల్వే జోన్ అంశమే ప్రస్తావనకు రాలేదన్నారు. కేవలం తమ పార్టీపై దుష్ప్రచారం చేసేందుకే ఈ అంశంపై లేనిపోని వాస్తవాలు రాశారని మండిపడ్డారు.

పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ కు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారని,  రాజధానికి..  కొవ్వూరు మీదుగా తెలంగాణాలో  ఉన్న ప్రాంతాలతో కలిపి రైల్వే లైన్ నిర్మించాలని పొందుపరిచారని వివరించారు.  రాజధానికి కనెక్ట్ చేసేలా రైల్వే లైన్ నిర్మించాలని, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలన్న అంశమే నిన్నటి సమావేశంలో చర్చకు వచ్చిందన్నారు. రాజధానికి కనెక్ట్ అంశం పునర్విభజన చట్టంలోనే ఉంది కాబట్టి మొత్తం వ్యయం కేంద్రమే భరించాలని రాష్ట్ర తరఫున వాదన వినిపించారని వెల్లడించారు.

రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ ఎన్నో పోరాటాలు చేసిందని, నూటికి నోరు శాతం రైల్వే జోన్ వచ్చి తీరుతుందని, అలా రాకపోతే తాను పదవికి రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి  ప్రకటించారు. అవాస్తవాలు ప్రచురించి కులాభిమానం చూపించుకొని మిమ్మల్ని మీరు దిగజార్చుకోవద్దని హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్