Saturday, July 27, 2024
HomeTrending Newsరైల్వే జోన్ వచ్చి తీరుతుంది: సోము

రైల్వే జోన్ వచ్చి తీరుతుంది: సోము

విశాఖ రైల్వే జోన్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ ఇప్పటికే తయారు చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. త్వరలోనే కేంద్ర మంత్రి వచ్చి రైల్వే జోన్ ను ప్రారంభిస్తారని వెల్లడించారు. నిన్న కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం విభజన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైందని, ఇవి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశాలపైనే దృష్టి సారిస్తుందని చెప్పారు. రైల్వే జోన్ అనేది రెండు రాష్ట్రాలకూ సంబంధించిన అంశం కాదని, దానికి… తెలంగాణ అభ్యంతరాలకు ఏమి సంబంధం ఉందని సోము ప్రశ్నించారు. కొందరు కావాలనే జోన్ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో  అమృత్ సరోవర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అవగాహన లేకుండా ఈ అంశాన్ని సమావేశం ఎజెండాలో పొందుపరిచారని చెప్పారు. రైల్వే జోన్ వచ్చి తీరుతుందనిఆయన ధీమా వ్యక్తం చేశారు. రైల్వే జోన్ అనేది రాజకీయ పరమైన నిర్ణయమని….  నిన్నటి సమావేశంలో కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారులు చెప్పారని సోము గుర్తు చేశారు.  కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు జేయడానికే కొన్ని వార్తా పత్రికలూ ఈ అంశంపై అవాస్తవాలు ప్రచురించాయని సోము ఆరోపించారు.

Also Read : రైల్వే జోన్ రాకపోతే రాజీనామా : విజయసాయి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్