Friday, March 13, 2026
HomeTrending Newsగోవాలో ఎలక్ట్రిక్ బస్సులు

గోవాలో ఎలక్ట్రిక్ బస్సులు

విద్యుత్తు వాహనాల తయారీలో అగ్రగామి, మేఘా ఇంజినీరింగ్ అనుబంధ ఒలెక్ట్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థకు చెందిన బస్సులను గోవా రాష్ట్రంలో శనివారం కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే..

ఎలక్ట్రిక్ వాహనాల(EV) ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణపై రూపొందించాల్సిన విధివిధానాలపై గోవా రాష్ట్రంలోని లాలిట్ గోల్ఫ్ & స్పా రిసార్ట్, కెనకోనాలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నుండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరైయ్యారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు వాహనాల తయారీ పై వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్న దృష్ట్యా దేశంలోనే అతి పెద్ద వాహనాల తయారీ యూనిట్ ను 300 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ లో ఏర్పాటు చేయనున్న విషయం విదితమే.

ఈ ప్లాంట్ ను అతి తక్కువ మానవ ప్రమేయం, పూర్తిస్థాయి ఆటోమేషన్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో నెలకొల్పనున్నారు. బస్సులు తో పాటు త్రివీలర్స్, ట్రక్కులు, ఇతర వాహనాలు కూడా తయారు చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular