Saturday, March 29, 2025
Homeస్పోర్ట్స్ఉప్పల్‌ స్టేడియానికి కరెంట్‌ కట్‌

ఉప్పల్‌ స్టేడియానికి కరెంట్‌ కట్‌

No Power in Stadium:
ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి రూ.కోటికి పైగా విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో  సరఫరా నిలిపివేసినట్లు ఏడీఈ బాలకృష్ణ మంగళవారం పేర్కొన్నారు. బిల్లులు చెల్లించకుండా కరెంటును యధావిధిగా వాడుకోవడంతో శాఖ అధికారులు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ)పై గతంలో విద్యుత్తు చౌర్యం కేసు నమోదు చేశారు. దీంతో హెచ్‌సీఏ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విద్యుత్తు శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇటీవల అధికారులు బకాయిల విషయమై హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసినా..చెల్లించకపోవడంతో సరఫరా నిలిపేశారు. మైదానంలో చీకట్లు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్