Electricity Laws Should Also Be Repealed :

వ్యవసాయ చట్టాలను రద్దు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనక్కి తగ్గటాన్నిహర్షిస్తున్నామని, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని తెరాస ఎంపిలు డిమాండ్ చేశారు. రైతులకు అండగా ఉంటానని సీఎం కేసీఆర్ ధర్నా చేయటంతో దేశంలో కదలిక వచ్చిందన్నారు. TRS పార్టీ లోక్ సభ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పి. రాములు, మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాలోత్ కవిత, వెంకటేష్ నేత లతో కలిసి చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి.రంజిత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.  కేసీఆర్ బాటలోనే నడవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారని, బిజెపి నాయకులు రాష్ట్రంలో ఒక మాట…కేంద్రంలో ఒక మాట్లాడుతున్నరని మండిపడ్డారు.

కేంద్రం వరి ధాన్యం కొనే విధంగా ఒక చట్టం తేవాలని, కేంద్రం ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకుని ఉంటే రైతులు చనిపోయేవారు కాదన్నారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవడంలో కేసీఆర్ పాత్ర ఉందని, రాష్ట్ర బిజెపి నేతలకు బడిత పూజ తప్పదన్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఆందోళనలు చేసిందని, రాష్ట్ర బిజెపి నేతలకు విషయ పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంభోదించిన సంయమనం పాటించామని, బండి సంజయ్ రైతు పక్షపాతి అయితే కేంద్రం మెడలు వంచి యాసంగి వడ్లను కొంటామని  ఉత్తర్వులు తీసుకురావాలన్నారు. కేంద్రం విద్యుత్ చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలని, రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను వాడుకోవద్దని తెరాస ఎంపిలు హితవు పలికారు.

Also Read : రైతు చట్టాలు రద్దు: మోడీ ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *