Sunday, January 19, 2025
HomeTrending NewsAI Threat: కృత్రిమ మేధస్సుతో ముప్పు - ఎలాన్ మస్క్

AI Threat: కృత్రిమ మేధస్సుతో ముప్పు – ఎలాన్ మస్క్

అణ్వాయుధాల కంటే కృత్రిమ మేధస్సు చాలా ప్రమాదకరమంటూ ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తన జీవితకాలంలో ఎన్నో టెక్నాలజీలు అభివృద్ధి చెందడం చూశానని.. వాటిలో ఈ స్థాయి ప్రమాదం ఏదీ లేదన్నారు. కృత్రిమ మేధస్సు వ్యవస్థ భవిష్యత్‌లో మానవుడు చేయగల ఏదైనా మేధోపరమైన పనిని అర్థం చేసుకోవడంతో పాటు నేర్చుకోగలదని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. తన మాజీ భార్య, ఇంగ్లిష్‌ నటి తాలులా రిలీ చేసిన ఓ ట్వీట్‌పై మస్క్‌ స్పందించారు.

కృత్రిమ మేధస్సు అణ్వాయుధాల కంటే ప్రమాదకరమని తన అభిప్రాయమని, సూపర్‌ స్మార్ట్‌ హ్యూమన్స్‌ దేన్నైనా ఊహించడంలో సమస్యలు ఎదుర్కొంటారు అని పేర్కొన్నారు. గతంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సైతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ముప్పు తప్పదని హెచ్చరించారు. ముప్పును ఎదుర్కోవాలంటే కృత్రిమ మేధ టెక్నాలజీపై నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ‌ను అంద‌రికీ ప్రయోజ‌న‌క‌ర‌మైన మార్గంలో వినియోగించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై ప్రభుత్వాలు తక్షణ దృష్టి సారించాలన్నారు. టెక్నాలజీని సరిగా ఉప‌యోగించుకోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్