Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్యూఎస్ ఓపెన్ విజేత రదుకాను

యూఎస్ ఓపెన్ విజేత రదుకాను

గ్రేట్ బ్రిటన్ టెన్నిస్ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను ఈ ఏడాది యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచింది. భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్ లో కెనడాకు చెందిన 19 ఏళ్ళ అన్ సీడెడ్ లైలా ఫెర్నాండెజ్ పై 6-4; 6-3 వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది.

1968లో బ్రిటన్ కు చెందిన వర్గినియా వాడే యూ ఎస్ ఓపెన్ టైటిల్ గెల్చుకుంది. మళ్ళీ 58 ఏళ్ళ తరువాత ఇప్పుడు 18 ఏళ్ళ రదుకాను బ్రిటన్ కు టైటిల్ అందించింది. సెమీ ఫైనల్లో గ్రీసు దేశ క్రీడాకారిణి సకారి పై రెండు వరుస సెట్లలో సునాయాసంగా విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది ఎమ్మా.  44 ఏళ్ళ తరువాత దేశానికి గ్రాండ్ స్లామ్ సింగల్స్ సాధించిన క్రీడాకారిణిగా కూడా రదుకాను చరిత్ర సృష్టించింది.

బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్  రదుకానును అభినందించారు. ఆమె అకుంఠిత కృషి, అంకిత భావానికి దక్కిన ప్రతిఫలంగా అభివర్ణించారు. బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ కూడా అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్