Issues may resolve: పీఆర్సీలో ప్రకటించిన ఫిట్ మెంట్ లో ఎలాంటి మార్పూ ఉండబోదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హెచ్.ఆర్.ఏ. శ్లాబ్, ఐ.ఆర్.రికవరీలపైనే చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఉద్యోగుల ప్రతిపాదనలను సిఎం జగన్ దృష్టికి తీసుకు వెళతామని ఆ తర్వాత మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతామని చెప్పారు. ఈరోజుతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు బొత్స చెప్పారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని కొన్ని అంశాల్లో బేధాభిప్రాయాలు మాత్రమే వచ్చాయని చెప్పారు.
టిడ్కో ఇళ్ళపై నేడు ఓ పత్రికలో వచ్చిన వార్తను బొత్స ఖండించారు. వారికి ఏదైనా సమాచారం కావాలనుకుంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, వారి ఉద్దేశాలను తమపై రుద్దే ప్రయత్నం చేయవద్దని సూచించారు. టిడ్కో ఇళ్ళలో మూడు శ్లాబులు నిర్ణయించామని, వాటిలో 300, 365, 430 చదరపు అడుగుల ఇళ్ళు నిర్మించి ఇస్తున్నామని వీరిలో 300 ఎస్.ఎఫ్.టి. ఇళ్ళు పొందే లబ్ధిదారుడికి కేవలం ఒక్క రూపాయికే ఇస్తున్నామని, వారిపై ఎలాంటి బ్యాంకు లోన్లు పడవని, మిగతా రెండు స్లాబుల లబ్ధిదారులకు వారి పేరిట బ్యాంకు రుణాలు ఇప్పించి ఇళ్ళ నిర్మాణం పూర్తి చేస్తామని, ఆ తరువాత లోన్లు వారు కట్టుకోవాల్సి ఉంటుందని వివరణ ఇచ్చారు.
Also Read : నమ్మకం లేదనడం సరికాదు: బొత్స