Ashes- Boxing day:
యాషెస్ సిరీస్ లో భాగంగా నేడు మొదలైన బాక్సింగ్ డే (మూడో) టెస్టులోనూ ఆస్ట్రేలియా మొదటిరోజు తన సత్తా చాటింది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో నేడు ఆరంభమైన ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు నాలుగు వద్ద హసీబ్ హమీద్ డకౌట్ గా వెనుదిరిగారు. 13 వద్ద మరో ఒపెనర్ల్ జ్రాక్ క్రాలే (12) కూడా పెవిలియన్ చేరాడు. 61 వద్ద డేవిడ్ మలాన్ (14) కూడా ఔటయ్యాడు. ఈ మూడు వికెట్లు ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ ఖతాలోనే పడడం విశేషం. బౌలర్లు లియాన్, స్టార్క్ లు కూడా రాణించడంతో ఇంగ్లాండ్ 185పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లో కెప్టెన్ రూట్-50, బెయిర్ స్టో-35, స్టోక్స్-25 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.
తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 61పరుగులు చేసింది. 38 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ , జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మార్కస్ హారిస్(20), నాథన్ లియాన్(0) క్రీజులో ఉన్నారు.
ఇంగ్లాండ్ జట్టులో నాలుగు మార్పులు చేశారు. ఓపెనర్ రోరి బర్న్స్ స్థానంలో క్రాలే ను, ఓలి పోప్ స్థానంలో బెయిర్ స్టో; రెండో టెస్టులో విఫలమైన స్టువార్ట్ బ్రాడ్ స్థానంలో జాక్ లీచ్ కు అవకాశం కల్పించారు. క్రిస్ ఓక్స్ స్థానంలో మార్క్ వుడ్ ను తీసుకున్నారు.
ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు చేశారు. రెండో టెస్ట్ మిస్ అయిన కెప్టెన్ కమ్మిన్స్ జట్టులో చేరాడు. స్కాట్ బొలాండ్ ను జట్టులోకి తీసుకున్నారు. జె రిచర్డ్సన్ , మైఖేల్ నేసేర్ లను తప్పించారు.
మొదటి రెండు టెస్టుల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఈ టెస్టులో కూడా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం విశేషం.