యాషెస్ సిరీస్ లో భాగంగా లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ మైదానంలో మొదలైన చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 283 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లు స్టార్క్, హాజెల్ వుడ్, ముర్ఫి లు రాణించి ఇంగ్లాండ్ ను కట్టడి చేశారు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, ఇంగ్లాండ్ తొలి వికెట్ కు62 పరుగులు చేసింది. డకెట్-41 స్కోరు చేసి వెనుదిరిగాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ జాక్ క్రాలే(22) కూడా ఔటయ్యాడు. జట్టు స్కోరు 73 వద్ద జో రూట్(5) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో హ్యారీ బ్రూక్- మోయీన్ అలీ లు నాలుగో వికెట్ కు 111 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. మోయిన్-34 రన్స్ చేసి ఔట్ కాగా కెప్టెన్ బెన్ స్టోక్స్ (3); బెయిర్ స్టో (4) విఫలమయ్యారు. 85 పరుగులు చేసిన బ్రూక్ ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మార్క్ వుడ్-28; క్రిస్ ఓక్స్-36 పరుగులతో రాణించారు. 54.4 ఓవర్లపాటు ఆడి 283 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.
స్టార్జ్క్ 4; హాజెల్ వుడ్ , మర్ఫి చెరో 2; కమ్మిన్స్ మిచెల్ మార్ష్ చెరో వికెట్ పడగొట్టారు.
కంగారూలు తొలి వికెట్ కు 49 పరుగులు చేశారు. వార్నర్ 24 పరుగులకు వెనుదిరగ్గా, ఉస్మాన్ ఖవాజా-26; లబుషేన్- 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. క్రిస్ ఓక్స్ కు ఒక వికెట్ దక్కింది.