Tuesday, March 17, 2026
Homeస్పోర్ట్స్ICC Men’s T20 World Cup 2022: ఆఫ్ఘన్ పై ఇంగ్లాండ్ విజయం

ICC Men’s T20 World Cup 2022: ఆఫ్ఘన్ పై ఇంగ్లాండ్ విజయం

పురుషుల టి 20 వరల్డ్ కప్, సూపర్12లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘన్ ను 112 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లాండ్, ఈ లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి సాధించింది.

పెర్త్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇబ్రహీం జర్డాన్-32; ఉస్మాన్ ఘని-30 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్ శామ్ కరణ్ వీరిద్దరి తో పాటు మరో మూడు వికెట్లు తీసుకొని బ్యాటింగ్ లైనప్ ను చెల్లా చెదురు చేశాడు. దీనితో 19.4 ఓవర్లలో 112 పరుగులకే ఆఫ్ఘన్ ఆలౌట్ అయ్యింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో శామ్ కరణ్ ఐదు; బెన్ స్టోక్స్, మార్క్ వుడ్ చెరో రెండు; క్రిస్ ఓక్స్ ఒక వికెట్ సాధించారు.

ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ కూడా ఐదు వికెట్లు కోల్పోయింది. లివింగ్ స్టోన్-29 పరుగులతో అజేయంగా నిలవగా, జోస్ బట్లర్-18; అలెక్స్ హేల్స్-19;  డేవిడ్ మలాన్-18 పరుగులు చేసి ఔటయ్యారు.

శామ్ కరణ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ICC Men’s T20 World Cup 2022: ఆఫ్ఘన్ పై ఇంగ్లాండ్ విజయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular