బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 132 పరుగులతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండో మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. ధాకా లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ 124 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్సర్ తో 132; కెప్టెన్ బట్లర్ 64 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 76; మోయిన్ అలీ-42; శామ్ కర్రాన్-33 పరుగులతో సత్తా చాటారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 326 పరుగులు చేసింది.
బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3; మెహిదీ మిరాజ్ 2; షకీబ్ అల్ హసన్, తైజుల్ ఇస్లామ్ చెరో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 9 పరుగులకే మూడు వికెట్లు (లిట్టన్ దాస్-డకౌట్; నజ్ముల్ హుస్సేన్ శాంటో-డకౌట్; ముష్ఫిఖర్ రెహ్మాన్-4) కోల్పోయింది. ఈ మూడూ కర్రన్ కే దక్కాయి. జట్టులో షకీబ్ అల్ హసన్-58; ముహ్ముదుల్లా-32; అఫిఫ్ హొస్సేన్-23; తస్కిన్ అహ్మద్-21 కాస్త ఫర్వాలేదనిపించారు, 44.4 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో శామ్ కర్రన్, ఆదిల్ రషీద్ చెరో 4; మోయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టారు.
జేసన్ రాయ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.