Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఇన్నింగ్స్ 76 పరుగులతో ఇండియా ఓటమి

ఇన్నింగ్స్ 76 పరుగులతో ఇండియా ఓటమి

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఇండియా ఘోర పరాజయం పాలైంది. ఇన్నింగ్స్ 76 పరుగులతో ఓటమి పాలైంది. లీడ్స్ లోని హెడింగ్లే స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ నాలుగో రోజు మొదటి సెషన్ తోనే ముగిసింది. నిన్న మూడోరోజు ఇండియా ఆట తీరు కాస్త గాడిలో పడినట్లు కనిపించినా నేడు  వరుస వికెట్లు పోగొట్టుకుని దారుణ పరాజయాన్ని మూట గట్టుకుంది. మిడిలార్డర్ ఆటగాళ్ళు రాణించలేక పోయారు.

పుజారా-91, కోహ్లి-45 పరుగులతో నేడు బ్యాటింగ్ ప్రారంభించారు. పరుగుల ఖాతా తెరవకముందే పుజారా ఓలీ రాబిన్సన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. కోహ్లీ మరో పది పరుగులు జత చేసి వ్యక్తిగత స్కోరు 55 వద్ద రాబిన్సన్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 25 బంతుల్లో 5  ఫోర్లు 1 సిక్సర్ తో  30 పరుగులు సాధించినా అప్పటికే ఇండియా ఓటమి ఖరారైంది. ఓలీ రాబిన్సన్ ఐదు వికెట్లు సాధించి, క్రెగ్ ఓవర్టన్ -3 వికెట్లు రాబట్టారు. మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్ చెరో వికెట్ సాధించారు.  ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1 తో సమం చేసింది ఇంగ్లాండ్.

నాలుగో టెస్ట్ మ్యాచ్ ఓవల్ స్టేడియం లో సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది.

ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ అవార్డు ఓలీ రాబిన్సన్ కు దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్