Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ : బ్రాడ్ దూరం

ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ : బ్రాడ్ దూరం

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్ టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. కుడికాలు గాయంతో తదుపరి నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడడం లేదు. ఈ విషయాని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ద్రువీకరించింది. కుడిమోకాలు కింద వెనుక భాగంలో ఉన్న నరం కొద్దిగా చిట్లిపోయినట్లు నిన్న నిర్వహించిన ఎంఆర్ఐ స్కాన్ లో నిర్ధారణ అయ్యింది. మంగళవారం లార్డ్స్ లో ప్రాక్టీస్ సందర్భంగా ఈ గాయం అయ్యింది. దీంతో బుధవారం పరీక్ష నిర్వహించారు.  షాకిబ్ మహమూద్ ను బ్రాడ్ స్థానంలో జట్టులోకి ఎంపిక చేసినట్లు ఇంగ్లాండ్ బోర్డు తెలిపింది.

ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా నేటి (ఆగస్ట్ 12) నుంచి  రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ట్రెండ్ బ్రిడ్జ్ లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్  డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో బ్రాడ్ వికెట్లు సాధించలేకపోయాడు, రెండో ఇన్నింగ్స్ లో ఇండియా కోల్పోయిన ఒకే వికెట్ బ్రాడ్ ఖాతాలో పడింది. ఆ మ్యాచ్ లో ఆట చివరి రోజు ఇండియా 157 పరుగులు సాధించాల్సిన దశలో వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించడంతో టెస్టు డ్రా గా ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular