Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Ashes 2023: ఇంగ్లాండ్ 393/8 డిక్లేర్;

Ashes 2023: ఇంగ్లాండ్ 393/8 డిక్లేర్;

చారిత్రక యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ను 8 వికెట్లకు 393 పరుగుల వద్ద అనూహ్యంగా డిక్లేర్ చేసింది. ఈసారి ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోన్న ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ బర్మింగ్ హాంలోని ఎడ్జ్ బాస్టన్ వేదిక గా నేడు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.  కెప్టెన్ జో రూట్ సెంచరీ (118) తో నాటౌట్ గా నిలిచి సత్తా చాటాడు. బెయిర్ స్టో-78; ఓపెనర్ జాక్ క్రాలే-61; హ్యారీ బ్రూక్-32 రన్స్ సాధించారు. రూట్- బెయిర్ స్టో లు ఆరో వికెట్ కు 121  పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్ 4; హాజెల్ వుడ్ 2; బొలాండ్, గ్రీన్ చెరో వికెట్ సాధించారు.

మొదటి రోజే తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్ట పోకుండా 14 పరుగులు చేసింది. వార్నర్-8; ఖవాజా-4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్