యాషెస్ సిరీస్ తొలి టెస్టు రసవత్తరంగా మారింది. అసీస్ విజయానికి 174 పరుగులు అవసరం కాగా, చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్ లో నిన్న మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసిన ఇంగ్లాండ్ 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జో రూట్-46; హ్యారీ బ్రూక్-46; బెన్ స్టోక్స్-43; రాబిన్సన్-27 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ కమ్మిన్స్, నాథన్ లియాన్ చెరో 4వికెట్లు పడగొట్టారు. హాజెల్ వుడ్, బొలాండ్ కు చెరో వికెట్ దక్కింది.
281 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇనింగ్స్ లో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్-36; లబుషేన్-13; స్టీవెన్ స్మిత్-6రన్స్ చేసి వెనుదిరిగారు. ఉస్మాన్ ఖవాజా-34; స్కాట్ బొలాండ్- 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు స్టువార్ట్ బ్రాడ్ 2; ఓలీ రాబిన్సన్ ఒక వికెట్ పడగొట్టారు.
ఖవాజా తో పాటు ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ లాంటి హేమాహేమీలు ఉన్నా, ఇంగ్లాండ్ బౌలర్లు తొలి సెషన్ లో చెలరేగితే కంగారూలకు కష్టాలు తప్పవు.