Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Women T20WC: పాక్ పై శివాలెత్తిన ఇంగ్లాండ్ ప్లేయర్లు- భారీ విజయం

Women T20WC: పాక్ పై శివాలెత్తిన ఇంగ్లాండ్ ప్లేయర్లు- భారీ విజయం

మహిళల టి20 వరల్డ్ కప్ లో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న ఇంగ్లాండ్ నేడు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారీ విజయం నమోదు చేసింది. ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగులు చేయగా, భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 99 పరుగులు మాత్రమే చేసింది.

కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్ విమెన్ నటాలీ స్కివర్ 40 బంతుల్లో 12ఫోర్లు, 1సిక్సర్ తో 81 నాటౌట్; డానియెల్ వ్యాట్ 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 59; అమీ జోన్స్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్ తో 47 పరుగులతో విజృంభించడంతో 213 పరుగుల భారీ స్కోరు చేసింది. మహిళల టి 20 వరల్డ్ కప్ లో ఇదే హయ్యస్ట్ స్కోరు.  వ్యాట్-స్కివర్ లు మూడో వికెట్ కు 74; స్కివర్-అమీ జోన్స్ ఐదో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

పరుగుల ఖాతా తెరవకముందే వికెట్ కోల్పోయిన పాక్, 15 వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. జట్టులో తుబా హుస్సేన్ చేసిన 28 పరుగులే హయ్యస్ట్ స్కోర్. కాథరిన్ స్కివర్, చార్లోట్ డీన్ చెరో రెండు; నాటాలి స్కివర్, సారా గ్లెన్, ఎక్సెల్ స్టోన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

కాథరిన్ స్కివర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్