Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్Ashes 2nd Test: డకెట్ సెంచరీ మిస్, ఇంగ్లాండ్ 278/4

Ashes 2nd Test: డకెట్ సెంచరీ మిస్, ఇంగ్లాండ్ 278/4

యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ దీటుగా బడులిస్తోంది. ఐదు వికెట్లకు 339 పరుగుల వద్ద నేడు రెండో రోజు ఆట మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్టీవెన్ స్మిత్ సెంచరీ (110) చేయగా అలెక్స్ క్యారీ-22; కమ్మిన్స్-22 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోస్ టంగ్, రాబిన్సన్ చెరో 3; జో రూట్ 2;  అండర్సన్, బ్రాడ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మొదటి వికెట్ కు 91 పరుగులు చేసింది. జాక్ క్రాలే 48 స్కోరు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 188 వద్ద ఓలీ పోప్ (42)  వెనుదిరగ్గా, 208 వద్ద బెన్ డంకెట్ తన వ్యక్తిగత స్కోరు 98 వద్ద హాజెల్ వుడ్ బౌలింగ్ లో వార్నర్ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు.  జో రూట్  కావాలం 10 రన్స్ మాత్రమే  చేసి పెవిలియన్ చేరాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 278 స్కోరు చేసింది. హ్యారీ బ్రూక్-47; బెన్ స్టోక్స్-17 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 138 పరుగులు ఇంగ్లాండ్ వెనుకబడి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular