Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్England Clean Sweep: నెదర్లాండ్స్ తో సిరీస్

England Clean Sweep: నెదర్లాండ్స్ తో సిరీస్

నెదర్లాండ్స్ తో జరుగుతోన్న వన్డే సిరీస్ ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్ లో పర్యటిస్తోంది. నేడు జరిగిన మూడో మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ సెంచరీ(101);  కెప్టెన్ బట్లర్ 84 పరుగులతో అజేయంగా నిలిఛి గెలిపించారు.

అమ్ స్టెల్వీన్ లోని వీఆర్ఏ క్రికెట్ గ్రౌండ్ లోనే ఈ మూడు మ్యాచ్ లు జరిగాయి, నేడు జరిగిన చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకుంది, నెదర్లాండ్స్ లో కెప్టెన్ ఎడ్వార్డ్స్-64; బస్ దే లీడే-56; మాక్స్ ఒడుడ్-50 మాత్రమే రాణించారు.  49.2 ఓవర్లలో 244  పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్లీ నాలుగు; బ్రేదాన్ కార్సే రెండు; ఆదిల్ రషీద్, లివింగ్ స్టోన్, పెనే తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ఇంగ్లాండ్ తొలి వికెట్ కు 85 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 49 పరుగులు చేసి అవుట్ కాగా, అదే స్కోరు వద్ద వన్ డౌన్ లో వచ్చిన డేవిడ్ మలాన్ డకౌట్ గా వెనుదిరిగాడు. జేసన్ రాయ్ 86 బంతుల్లో 16 ఫోర్లతో101;  బట్లర్ 64 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 86పరుగులు చేసి, 30.1 ఓవర్లలోనే విజయం అందించారు.

నెదర్లాండ్స్ బౌలర్లలో పాల్ మాన్ మీకేరీన్ కు రెండు వికెట్లు దక్కాయి.

జేసన్ రాయ్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కగా, ప్లేయర్ అఫ్ ద సిరీస్ ను ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ గెల్చుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular